అన్న చేతిలో తమ్ముడు హతం

అన్న చేతిలో తమ్ముడు హతం

HYD: మద్యం మత్తులో తరచూ గొడవపడుతుండడంతో తమ్ముడిని సొంత అన్నే హతమార్చాడు. ఆజంపుర డివిజన్‌ ఉస్మాన్‌పురా ప్రాంతంలో హషీమ్‌, సఫ్దర్‌ అన్నదమ్ములు నివసిస్తున్నారు. బుధవారం సఫ్దర్‌ మద్యం తాగి వచ్చి ఇంటి వద్ద గొడవ పడుతుండగా హషీమ్‌ తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.