కైకలూరులో అగ్నిప్రమాదం

కైకలూరులో అగ్నిప్రమాదం

ELR: కైకలూరు మండలం ఆటపాకలోని నాయుడు కాంప్లెక్సు ఎదురుగా ఉన్న ఆక్వా ల్యాబ్లో ఇవాళ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు.