తిరుమల వేంకన్న సేవలో సినీ నటుడు

చిత్తూరు: సినీ నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు బాలాదిత్య కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల బాలాదిత్యతో అభిమానులు, భక్తులు ఫోటోలు దిగారు.