సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో
ప్రకాశం: కంభం పట్టణంలోని సచివాలయం-4ను ఎంపీడీవో వీరభద్రచారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. డిజిటల్ అసిస్టెంట్‌కు సంబంధించి ఏపీ సేవా సర్వీసెస్ అమౌంట్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు రెమిటెన్స్ చేయాలి అని ఆదేశించారు.