ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. కేసు నమోదు

ADB: ఉట్నూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ విజయేందర్‌పై లక్షెట్టి పేట పట్టణానికి చెందిన దూడ శంకూర దాడి చేశాడు. అంబేద్కర్ చౌక్ వద్దకు వచ్చి, 'నా బైక్‌ను ఢీ కొడతావా' అని బూతులు తిడుతూ కొట్టినట్లు డ్రైవర్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దూడ శంకూరపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపతి సురేష్ బుధవారం తెలిపారు.