నూతన జీపీవోను సన్మానించిన గ్రామ ప్రజలు

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో నూతనంగా గ్రామ పంచాయతీ అధికారి (జీపీవో)గా విధులు నిర్వహించడానికి విచ్చేసిన రాపోలు నర్సయ్యకు గ్రామ ప్రజలు ఇవాళ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.