ఎలుగుబంటి దాడిలో మేకల కాపరికి గాయాలు

ఎలుగుబంటి దాడిలో మేకల కాపరికి గాయాలు

MDK: అడవిలో మేకలు మేపడానికి వెళ్లిన ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని దంతెపల్లి గ్రామానికి చెందిన నకిర్తి సిద్దయ్య అనే వ్యక్తి శనివారం తమ్మిడి కుంట వద్ద మేకలు మేపుతున్న సమయంలో అకస్మాత్తుగా అడవిలో నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేసింది. గాయపడిన సిద్దయ్యను ఆసుపత్రికి తరలించారు.