గెలవడం భారత్ DNAలోనే ఉంది: పాక్
భారత జట్టును ఎవరూ కట్టడి చేయలేరని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. T20 WC ఫైనల్‌లో టాస్ ఓడిన తర్వాత కూడా 250 చేశారని, ACC, ICC ట్రోఫీలు గెలవడం భారత DNAలోనే ఉందని కొనియాడాడు. నాకౌట్స్ కన్నా ముందే ఓడిపోవడం పాక్ DNA అని తమ జట్టును విమర్శించాడు. బలహీన క్రికెట్ బోర్డులే ప్లేయర్లకు ఫైన్ విధిస్తుంటాయని PCBకి చురకలు అంటించారు.