VIDEO: కాజ్ వేపై ప్రమాదకరంగా మారిన ఇనుప చువ్వలు

MLG: ఏటూరునాగారం-మంగపేట ప్రధాన రహదారిపై గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. జీడివాగు కాజ్ వేపై లేచిన ఇనుప చువ్వలు స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ రహదారిపై గుంతలు అధికంగా ఉన్నాయి. ఈ గుంతలు, ఇనుప చువ్వలు ప్రమాదాలకు కారణం కాకముందే అధికారులు స్పందించాలని మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.