'ఆదివాసి దినోత్సవాన్ని గ్రామ గ్రామాన నిర్వహించాలి'

KMM: ప్రపంచ ఆదివాసి పోరాట దినోత్సవాన్ని బుధవారం ఖమ్మం ఖానాపురం హవేలీ సెంటర్‌లో నిర్వహించారు. సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్, సుంకర బుచ్చయ్య గ్రామగ్రామాన ఆదివాసి దినోత్సవం జరపాలని పిలుపునిచ్చారు. పాలకులు ప్రలోభాలతో హక్కులకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. ఆదివాసి గూడెళ్లలో విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్నారు.