‘విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి’
KDP: ఖాజీపేట సీఐ వంశీధర్ విద్యార్థులు చట్టాలపట్ల అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు. శుక్రవారం, మండల పరిధిలోని ఆదర్శ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చట్టాల వివరాలు తెలియజేశారు. ఈవ్ టీజింగ్, సైబర్ నేరాల గురించి అవగాహన కలిపించి, శక్తి యాప్ వినియోగంపై సూచనలు ఇచ్చి విద్యార్థులను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.