హోటళ్లపై అధికారుల ఆకస్మిక దాడులు
BDK: దమ్మపేట మండల కేంద్రంలో బుధవారం సివిల్ సప్లై అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాల్లో గృహోపయోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ.. కమర్షియల్ అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.