అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒడియా అతిథి అధ్యాపక పోస్టుకు సెప్టెంబర్ 20లోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 22న ఉదయం 10గం.లకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. MA (ఒడియా)లో 50% మార్కులు, NET లేదా PHD అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.