అంగళ్లు వద్ద కారును ఢీకొన్న బైకు

అంగళ్లు వద్ద కారును ఢీకొన్న బైకు

అన్నమయ్మ: కురబలకోట మండలం అంగళ్లు విశ్వం కళాశాల వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లెకు చెందిన నవీన్, ప్రియాంక, మన్విత బైకుపై బయలుదేరారు. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు. కారు డ్రైవర్ కిరణ్ సహా బైకుపై ఉన్న నవీన్, ప్రియాంక, మన్విత తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108లో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.