VIDEO: గుంటూరులో మొదలైన వర్షాలు
GNTR: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. కొత్తపేట, గుంటూరు అర్బన్, కొరిపర మండలాల్లో రహదారులు జలమయమయ్యాయి. వ్యాపారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నేడు, రేపు పిడుగులతో వర్షం పడే అవకాశం ఉందన్నారు. విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్ల కింద ఉండవద్దని సూచించారు.