ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఐ ధర్నా

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీపీఐ ధర్నా

ATP: తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని పెంచాలని కోరుతూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని అలాంటి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.