VIDEO: త్వరలో సంగమేశ్వర ప్రాజెక్టు పనులు ప్రారంభం
ప్రకాశం: పొన్నలూరు మండలంలోని సంగమేశ్వర ప్రాజెక్టు పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి స్వామి ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు రూ.166.40 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. రూ. 25 కోట్లు తక్షణమే విడుదల చేసింది. దీంతో విధి విధానాలను తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.