అమీన్ పీర్ దర్గా ఉత్సవాలకు YS జగన్‌కు ఆహ్వానం
కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవాలకు హాజరుకావాలని మాజీ CM YS జగన్‌కు ప్రత్యేక అహ్వానం అందింది. గురువారం తాడేపల్లిలో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరీఫుల్లా హుస్సేనీ జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. నవంబర్ 5 నుంచి 10 వరకు ఈ ఉరుసు మహోత్సవాలు చేపడతామన్నారు. జగన్ ఉత్సవాలకు హాజరు కావాలని కడప మాజీ మేయర్ తదితరులు కోరారు.