తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం చర్యలు: నిర్మల రెడ్డి
SRD: తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 'సేఫ్ మదర్స్ డే' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సురక్షిత మాతృత్వంతో ఆరోగ్యమైన సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని చెప్పారు.