జూరాలకు భారీగా పెరిగిన వరద

జూరాలకు భారీగా పెరిగిన వరద

GDWL: కర్ణాటకలోని ఎగువ జలాశయాల నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. బుధవారం ప్రాజెక్టులోకి లక్ష 15 వేల క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు 89 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ​దీని ద్వారా ఎగువ, దిగువ జూరాలలోని 11 జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరుగుతుందన్నారు.