VIDEO: కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

PLD: నరసరావుపేట పట్టణ శివారు ప్రాంతమైన ఎస్.ఆర్.కే.టి కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలను, 1 ఆటో, 1 కారు, 10 రాడ్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారిస్తున్నారు. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.