శ్రీ భక్త మార్కండేయ మందిరంలో ఎంపీ పూజలు
JGL: జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ మందిరంలో సోమవారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా మందిరాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఎంపీని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ నాయకులు, తదితరులు ఉన్నారు.