కర్నూలు ఇంఛార్జ్ ఎస్పీగా రాణా

KRNL: నంద్యాల జిల్లా SPగా ఉన్న అదిరాజ్ సింగ్ రాణా.. కర్నూలు జిల్లా ఇంఛార్జ్ ఎస్పీగా వ్యవహరించనున్నారు. కర్నూలు జిల్లా SPగా ఉన్న విక్రాంత్ పాటిల్ తమ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన ఈనెల 14వ తేదీ వరకు సెలవులో ఉంటున్నారు. ఆయన తిరిగి వచ్చేవరకు నంద్యాల జిల్లా SPనే ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.