పశువులకు ఉచిత టీకాలు
KNR: పశువైద్య శాఖ పశుపోషకులకు ఈ నెల 10 నుంచి ఏప్రిల్ 9 వరకు గేదెలు, పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు పశు వైద్యాధికారి డా.అరవింద్ రెడ్డి తెలిపారు. పశువైద్య సిబ్బంది నిర్ణీత తేదీల ప్రకారం గ్రామాలకు వచ్చి టీకాలు వేస్తారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వ్యాధుల బారి నుంచి పశువులను కాపాడుకోవాలన్నారు.