గుంతకల్లు మీదుగా పలు రైళ్లు రద్దు
ATP: హైదరాబాద్ డివిజన్ పరిధిలో జరుగుతున్న డబ్లింగ్ పనుల వల్ల గుంతకల్లు నుంచి నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి 19 వరకు గుంతకల్లు - బోధన్ (57411), కాచిగూడ - గుంతకల్లు (57412) రైళ్లు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.