VIDEO: పుంగనూరులో కనిపించిన కొండచిలువులు
CTR: పుంగనూరు మర్రిమాకులపల్లి గ్రామ సమీపాన ఓ మామిడి తోటలో 13 అడుగులు ఉన్న రెండు భారీ కొండచిలువలు శుక్రవారం దర్శనమిచ్చాయి. పశువులను మేపడానికి వెళ్లిన గ్రామస్థులు వీటిని గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బీట్ ఆఫీసర్ శోభనాద్రి వారి రెస్క్యూ టీంతో వచ్చి రెండు కొండచిలువలను పట్టుకున్నారు. అనంతరం వాటిని అడవిలో సురక్షితంగా వదిలిపెట్టారు.