PHC ప్రారంభానికి సిద్ధం చేయాలి: కలెక్టర్

PHC ప్రారంభానికి సిద్ధం చేయాలి: కలెక్టర్

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పనులు పెయింటింగ్, లైటింగ్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట DMHO డాక్టర్ ప్రమోద్ కుమార్ ఉన్నారు.