'రైతుల ఆదాయం పెంచే దిశగా అడుగు'

'రైతుల ఆదాయం పెంచే దిశగా అడుగు'

SKLM: ఆమదాలవలస పురపాలక సంఘం పరిధిలో రూ.39.65 లక్షల నిధులతో నిర్మించిన కూరగాయల దుకాణ సముదాయాన్ని స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన కూరగాయలను నేరుగా మార్కెట్ ద్వారా విక్రయించుకునేందుకు ఈ సముదాయం మంచి అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు.