మల్టీ జోన్-1 పరిధిలో హెడ్ కానిస్టేబుళ్ల బదిలీ
KNR: మల్టీ జోన్- 1 పరిధిలో పనిచేస్తున్న 22 మంది హెడ్ కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ 16 మందిని కేటాయించగా, మెదక్ జిల్లాకు ఇద్దరు, సిద్దిపేటకు ఒకరిని, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ముగ్గురిని కేటాయిస్తూ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీలు పొందిన హెడ్ కానిస్టేబుళ్లు వెంటనే విధుల్లో చేరాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.