VIDEO: ఎస్సైపై ప్రశంసల వర్షం..!
SRPT: నేరేడుచర్ల మండలం, సోమారంకు చెందిన సుస్మిత అనే బాలిక మూసీ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. అయితే SI రవీందర్ పట్టుదలతో రాత్రంతా వెతికి సదరు బాలిక మృతదేహాన్ని బూర్గుల తండ దగ్గర గుర్తించారు. నీటి ప్రవాహం బలంగా ఉన్నప్పటికీ, రెస్క్యూ టీమ్, గజ ఈతగాళ్ల సహాయంతో తానే స్వయంగా ప్రవాహంలోకి వెళ్లి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. దీంతో SIపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.