రాష్ట్ర మహాసభలకు తరలి వెళ్లిన సీపీఐ నాయకులు

ATP: నేటి నుంచి ఒంగోలులో జరుగుతున్న సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలకు శనివారం గుంతకల్లు సీపీఐ నాయకులు తరలి వెళ్లారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా రాష్ట్రంలో పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వాల తీరు, ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందన్నారు.