రూ. 700 కోట్లతో మినీ జూరాల (బ్యారేజీ) నిర్మాణం: మంత్రి
NRPT: రాయచూర్‌లో కర్ణాటక ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి ఇవాళ సమావేశమయ్యారు. మక్తల్ నియోజకవర్గంలోని కొల్పూర్ వద్ద రూ. 700 కోట్లతో మినీ జూరాల (బ్యారేజీ) నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా నారాయణపేట, కొడంగల్ ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు తీరనున్నాయి. వృధాగా సముద్రంలో కలిసే వరద నీటిని ఒడిసి పట్టడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.