నందిగామలో ప్రపంచ తల్లిపాల వారోత్సవములు

NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవముల అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి పాల్గొని మాట్లాడుతూ.. పిల్లలకు తల్లిపాలు త్రాగించటం వలన పిల్లలకు ఎటువంటి రోగాలు దరిచేరవని అన్నారు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఆనందంగా ఎదుగుతారని తెలిపారు.