ఏయూ మాజీ వీసీకి జైలు శిక్ష
VSP: ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి హైకోర్టు ఒక నెల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2022లో ఏయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేసిన నూకన్నదొరను తొలగిస్తూ ప్రసాద్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై నూకన్నదొర హైకోర్టును ఆశ్రయించగా.. విధుల్లో కొనసాగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీనిని అమలు చేయకపోవడంతో హైకోర్టు ఈ శిక్షను విధించింది.