‘కాంగ్రెస్‌కు ఈశాన్య అభివృద్ధి పట్టదు’
అసోంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈశాన్య భారత్ అభివృద్ధిపై కాంగ్రెస్‌కు ఏనాడూ ఆసక్తి లేదని విమర్శించారు. కేవలం అసోం ప్రగతిని కాంక్షిస్తూనే తమ పార్టీ ఈ ప్రణాళికను సిద్ధం చేసిందని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.