ప్రారంభానికి సిద్దమైన ఆసుపత్రి

SRD: పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించిన ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధమైంది. అయితే ఈ ఆసుపత్రికి డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యానికి వ్యతిరేకంగా ఆయన ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. మద్రాస్ హైకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఆయన తీసుకొచ్చిన రూ.567కోట్ల CSR నిధులలో ఆసుపత్రి నిర్మాణానికి రూ.200కోట్లు కేటాయించారు.