పంచాయతీ కార్యదర్శికి సోకాజ్ నోటీసులు

పంచాయతీ కార్యదర్శికి సోకాజ్ నోటీసులు

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామ పంచాయతీ కార్యదర్శి చేపూరి లక్ష్మి నరసయ్యకు షోకాజ్ నోటీసు అందజేసినట్లు కడప పంచాయతీ అధికారిణి రాజ్యలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాధవరం-1 పంచాయతీలోని ప్రధాన రహదారిలో పారిశుధ్య పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం చేయడంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.