ALERT: పిడుగులతో కూడిన వర్షాలు
AP: రాష్ట్రంలో ఇవాళ పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. అల్లూరి, విశాఖ, కృష్ణా, గుంటూరు, కడపతో పాటు 16 జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించింది. రైతులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని స్పష్టం చేసింది.