‘LPG, CNG సప్లై ఆగకూడదు’

‘LPG, CNG సప్లై ఆగకూడదు’

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హర్మూజ్ జలసంధి మూసివేత దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో LPG, CNG సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వినియోగదారులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రధాని స్పష్టం చేశారు.