పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు
NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. దాదాపుగా 91 రోజులకు గాను స్వామి వారి అమ్మవారి ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు ఉన్న హుండీలు లెక్కింపు ద్వారా మొత్తం రూ. 1,11,61,254 /- రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు.