ఆర్గానిక్ పంటలను సందర్శించిన కలెక్టర్
MDK: టేక్మాల్ మండలం చంద్రు తండాను కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. తండాలో రైతులు సాగు చేస్తున్న సేంద్రియ పంటలను ఆమె పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించాలని సర్పంచ్ స్రవంతి కోరారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.