పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

KNR: శంకరపట్నం మండలంలోని మెట్‌పల్లి గ్రామానికి చెందిన ఇజిగిరి ఐలయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ మిల్క్ పార్లర్‌లో పని చేస్తున్న ఆయన మూడు రోజుల క్రితం స్వగ్రామం మెట్‌పల్లికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి పురుగుల మందు తాగినట్లు సమాచారం. ఉదయం స్థానికులు గమనించగా మృతి చెంది ఉన్నట్లు తెలిపారు.