ఉచిత చేప పిల్లలు విడుదల చేసిన మంత్రులు
SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ లాంఛనంగా మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రారంభించారు. రూ.5.17 లక్షలతో 3 లక్షల చేప పిల్లలను మంత్రులు చెరువులో వదిలారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా 253 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు. నియోజకవర్గం మొత్తం 165 చెరువులకు చేప పిల్లలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.