రాధాకృష్ణకు వ్యతిరేకంగా వైసీపీ నినాదాలు
ATP: ఏబీఎన్ రాధాకృష్ణ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శింగనమలలో వైసీపీ శ్రేణులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించాయి. బస్టాండ్ సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర మహిళలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.