శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు
TPT: ఏపీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన 9 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు ఆదివారం శ్రీసిటీని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ప్రణాళిక, మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ధి గురించి అధికారులు వివరాలు తెలుసుకున్నారు. పారిశ్రామిక వాతావరణం, పర్యావరణ హిత చర్యలను వారు ప్రశంసించారు.“మేడ్ @ శ్రీసిటీ” ఉత్పత్తుల ప్రదర్శనను కూడా వారు తిలకించారు.