జనగణన కార్యక్రమం సమర్థంగా నిర్వహించాలి: కలెక్టర్

జనగణన కార్యక్రమం సమర్థంగా నిర్వహించాలి: కలెక్టర్

NRPT: జనగణన-2027లో భాగంగా జిల్లాలో మొదటి విడత ఇళ్ల గణన ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి కలెక్టర్లు, జిల్లా జనగణన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మ్యాపుల తయారీ, సూపర్వైజర్ల నియామకం, గణనపై దిశానిర్దేశం చేశారు. తప్పులు దొర్లకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.