నాగార్జునసాగర్ బీసీ డిగ్రీ కళాశాల తరలింపు తాత్కాలికమే
NLG: నాగార్జునసాగర్‌లోని బీసీ గురుకుల విద్యాలయంలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలను తాత్కాలికంగా నిడమనూరుకి తరలిస్తున్నామని గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఇటీవల పైలాన్ కాలనీలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాల భవనాన్ని పరిశీలించడం జరిగింది. కానీ అది శిథిలావస్థకు చేరడంతో అక్కడ విద్యార్థులకు సురక్షితం కాదని అక్కడ నూతన భవన నిర్మాణం జరిగే వరకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.