'పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

'పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

KMR: బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో అకాల వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. చేతికొచ్చే సమయంలో పంటలు నేలమట్టం కావడంతో రైతులు భారీగా నష్టపోయారని ఏఎంసీ మాజీ ఛైర్మన్ హనుమంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.