48వ రోజుకు చేరిన రిలే దీక్షలు

48వ రోజుకు చేరిన రిలే దీక్షలు

AKP: బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా రాజయ్యపేటలో మత్స్యకారులు చేపట్టిన రిలే దీక్షలు నేటికి 48వ రోజుకు చేరాయి. బల్క్ డ్రగ్ పార్క్ రద్దుచేసి మత్స్యకారులను కాపాడాలని నినాదాలు చేశారు. 'బల్క్ డ్రగ్ పార్క్ వద్దు సముద్రం ముద్దు' అంటూ నినాదాలు చేశారు. సముద్రానికి తమను దూరం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను ఆదరించాలని వారు కోరుతున్నారు.