విస్తరాకుల తయారీ కేంద్రాన్ని పరిశీలించిన MLC
ASR: పాడేరు మండలం గుత్తులపుట్టు గ్రామాన్ని బుధవారం ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సందర్శించారు. అక్కడ స్వయం సహాయక సంఘ సభ్యులు నిర్వహిస్తున్న వన్ధన్ వికాస్ విస్తరాకుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. విస్తరాకుల తయారీవిధానం, ఆదాయం, ఎంతమంది సభ్యులు పనిచేస్తున్నారో వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వహకులను ప్రత్యేకంగా అభినందించారు.